పంజాగుట్ట ప్రమాదం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు పంపించారు. ఈ కేసు విషయమై తాజాగా డీసీపీ విజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. పంజాగుట్ట ప్రమాదం కేసులో తన కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించాడు. రాహిల్‌తో పాటుగా షకీల్ కూడా దుబాయ్‌కి పారిపోయాడు. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట ఇన్స్పెక్టర్తో పాటుగా బోధన్ సీఐని కూడా అరెస్ట్ చేశాం. నిందితుడికి పోలీసులు సహకరించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశామని. ఈ కేసులో మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అని పోలీసులు వెల్లడించారు.
పంజాగుట్ట ప్రమాదం కేసులో మరో కీలక పరిణామం
89
previous post