గోదావరి పరివాహక ప్రాంతాల్లో రైతులు మిరపసాగు చేశారు. ములుగు వెంకటాపురం మండలాల్లో చాల మంది రైతులు మిరపసాగు చేస్తారు. ఈ పంట చేన్ల లో పని చేయడానికి ఎక్కువగా ఛత్తీస్‌గఢ్ ప్రాంతం కూలీలు వలసలు వస్తారు. ప్రస్తుతం జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల భద్రత చర్యల్లో భాగంగా పోలీసులు గ్రామాల్లోకి కొత్తవారి వచ్చి ఉంటే వారి సమాచారాన్ని సేకరిస్తున్నారు. స్ధానికి ఎస్ఐ అశోక్ సిబ్బంది కలిసి కొత్తగా వలసులు వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు. వెంకటాపురంలో పలు మిరపసాగులో పని చేస్తున్న కూలీల వివరాలు సేకరించారు. వారికి మావోలకు ఏమైన సంబంధాలు ఉన్నాయా అనే విచారణ కూడ చేస్తున్నారు. గ్రామస్థలకు, కొత్తగా వచ్చిన కూలీలకు మావోయిస్టుల సమాచారం తెలిస్తే తెలియ చేయాలని పోలీసులు కోరారు. ఎవ్వరైన కొత్తవారిని గ్రామంలోకి వస్తే వారి వివరాలను ముందుకు పోలీసులకు ఇవ్వాలని, అనంతరమే వారిని పనిలో పెట్టుకోవాలని పోలీసులు రైతులకు, గ్రామస్థులకు సూచించారు
పార్లమెంట్ ఎన్నికల భద్రత చర్యలు…
100
previous post