భీమవరానికి చెందిన 8 మంది ప్రయాణికులు ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరు షార్జా నుండి హైదరాబాదుకు, హైదరాబాదు నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చే తరుణంలో ప్రయాణికులు లగేజీ మిస్సింగ్.. లగేజ్ తో పాటు టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్నాం, మా లగేజ్ కి బాధ్యులు ఎవరు అని ఏర్పోర్ట్, ఇండిగో సిబ్బందినీ ప్రయాణికులు నిలదీస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఇప్పటివరకు సామాన్లు వస్తున్నాయి అని సమాధానం చెబుతున్నారు, కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు.. వేల రూపాయలు పెట్టి టికెట్ కొన్న ఇండిగో విమానంలో కనీసం వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు.. షార్జా విమానాశ్రయంలో సర్వీస్ బావుంది. హైదరాబాద్ విమానాశ్రయంలో సర్వీస్ బాగుంది, కానీ గన్నవరం విమానాశ్రయంలో ఏడు గంటలకావస్తున్న మమ్మల్ని ఎవరు కనీసం పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ ఏడు గంటలకావస్తుంది మేము గత రెండు రోజుల నుంచి కువైట్ నుంచి ప్రయాణంలో అలసిపోయి ఉన్నాము. స్నానాలు లేవు, భోజనాలు లేవు, కనీసం మంచినీళ్లు సౌకర్యం కూడా లేదు అని ఎయిర్పోర్టు ఇండిగో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంటనే మా లగేజీ సామాన్లు మాకు కావాలి అని వారు ఇండిగో విమాన సర్వీసు సిబ్బందిలను నిలదీస్తున్నారు.
విమానాశ్రయంలో సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం..
64
previous post