పసుపులేటి శ్రీనివాస్ (Pasupuleti Srinivas):
నల్లగొండ జిల్లా, అడవిదేవులపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పసుపులేటి శ్రీనివాస్ ఓ మహిళతో గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. భర్త శంకర్, అతని బంధువులు తన భార్యతో అక్రమ సంబంధం నేర్పుతున్న పసుపులేటి శ్రీనివాస్ ను దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అడవి దేవులపల్లి మండలానికి చెందిన శంకర్, ధనలక్ష్మి లకు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది వీరికి ఇద్దరు కుమారులు శంకర్ గ్రామీణ పశు వైద్యునిగా (ప్రైవేట్) పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాస్ తో భార్య ధనలక్ష్మి అక్రమ సంబంధంపెట్టుకుంది. ఇది తెలిసినప్పటి నుండి శంకర్ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.
Follow us on : Facebook, Instagram & YouTube.
భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మూడు సంవత్సరాలు గా ధనలక్ష్మి వేరుగా ఉంటూ అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. ఈ క్రమంలోతన భర్త శంకర్ తనను వేధిస్తున్నారని గృహహింస కేసు పెట్టి ప్రియుడి రాజకీయ పలుకుబడితో శంకరును జైలుకు పంపించింది. అంతేకాకుండా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కక్షతో పలుమార్లు శంకర్ పై హత్యాయత్నం చేసినట్లు శంకర్ తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్య అక్రమ సంబంధం నెరుపుతున్న శ్రీనివాస్ తో గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దేహశుద్ధి చేసి భర్త శంకర్ పోలీసులకు అప్పగించాడు. అడవిదేవులపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Read Also..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.