వైసీపీ(YCP)ని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. కోససీమ జిల్లా మలికిపురం ఎన్నికల ప్రచారం(Election campaign) సభలో మాట్లాడుతూ.. రైతుల కష్టాలను నియోజకవర్గం ఎమ్మెల్యే ఏనాడు పట్టించుకోదని మండిపడ్డారు. డ్రైవర్‌ను చంపి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారని ఆ విషయాన్ని జనం అంత సులువుగా మరిచిపోరని అన్నారు. ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్సీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇదేక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు. వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్పు కనిపిస్తుందని పేర్కొన్నారు. ‘ఆంధ్రా ప్రజలరా ఊపిరి తీసుకోండి. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోందని’ అని పవన్ అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.