60
రాయదుర్గం పట్టణం బళ్ళారి రోడ్డులోని టెక్స్టైల్ పార్క్ వద్ద గత మూడు రోజుల నుండి చెత్తకు నిప్పు అంటుకుని విషవాయువు వెదజల్లుతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక వార్డ్ ప్రజలు, వాహనదారుకు పేర్కొన్నారు. గురువారం పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు మీడియాతో మాట్లాడారు. మూడు రోజులుగా విషవాయువును పీల్చుతూ అనారోగ్యాలకు గురి అవుతున్నామని పేర్కొన్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతూ పనులు కొనసాగిస్తున్నామన్నారు. మున్సిపల్ అధికారులు దీనిపై స్పందించడం లేదన్నారు. ఈ విషవాయువు వల్ల ఇప్పటికే చాలామంది ప్రజలకు దగ్గు జ్వరం తో గత మూడు రోజుల నుంచి అనారోగ్య పాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విషవాయువు రాకుండా చూడాలన్నారు.