ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) మరో కీలక మలుపు తిరగబోతోంది. ఓ ఎమ్మెల్సీ(MLC)కి నోటీసులు(Notices) ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పోలీసు సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్ పెద్దలకు సన్నిహితుడని చెబుతున్నారు. ఆ నాయకుడికి బీఆర్‌ఎస్ పాలనలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఆయన కనుసన్నల్లోనే ఇన్నాళ్లు పోలీసు పంచాయతీలు తీర్చినట్లు తెలుస్తోంది. ప్రగతిభవన్ అండతో ఆ ఎమ్మెల్సీ పోలీస్‌శాఖలో చక్రం తిప్పాడని అంటున్నారు.
ఇది చదవండి: పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్తల నియామకం..
అంతేకాదు.. బీఆర్‌ఎస్ పాలనలో ఆయన చెబితేనే పోలీస్‌శాఖలో బదిలీలు జరిగేవట. అప్పుడు.. బదిలీల కోసం, పోస్టింగుల కోసం ఆయన ఇంటిముందు చేతులు కట్టుకొని నిలబడ్డ పోలీసులు.. ఇప్పుడు ఆయనను విచారించాల్సిన అనుభవం ఎదురవుతోంది. ఆ ఎమ్మెల్సీ కూకట్‌పల్లి కేంద్రంగా సాగించిన దందాలు, సెటిల్‌మెంట్లపైనా జోరుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక.. పోలీసుల విచారణలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆయన చెప్పబోయే నేతల పేర్లపై అంతటా ఉత్కంఠ నెలకొంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి