83
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మ కత్వ సమీపంలో పిలాయి పల్లి కాలువలో గుట్టు చప్పుడు కాకుండా వ్యర్థ రసాయనాలను పారబోస్తున్న ట్యాంకర్ ను పోచంపల్లి పెట్రోలింగ్ పోలీసులు పట్టుకున్నారు. వెంటనే ట్యాంకర్ డ్రైవర్ని విచారించగా హైదరాబాదు లోని జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాల నుండి వ్యర్థ రసాయనాలను ట్యాంకర్ల లో తెచ్చి పిలాయి పళ్లి కాలువలో పారబోస్తున్నట్లు పోలీసుల ప్రథమ విచారణ లో తేలింది. ఎవరికి అనుమానం రాకుండా పెట్రోల్ ట్యాంకర్ల లా పోలి ఉన్న ట్యాంకర్లలో వ్యర్థ రసాయనాలను తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్ ను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసారు.