కోహ్లీ, షమీలపై ప్రధాని మోదీ ప్రశంసలు

modi

Advertisements

&NewLine;<p>ముంబైలో నిన్న జరిగిన ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ ను ఇండియా చిత్తు చేసింది&period; ఐసీసీ మెగా టోర్నీలో ఫైనల్స్ కు చేరిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది&period; నిన్నటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ&comma; శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో కదం తొక్కారు&period; 7 వికెట్లను కూల్చి మహ్మద్ షమీ కివీస్ ను మట్టికరిపించాడు&period; టీమిండియా ప్రదర్శనకు ప్రధాని మోదీ కూడా ఫిదా అయిపోయారు&period; జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ&comma; షమీలపై ప్రశంసలు కురిపించారు&period; వన్డేల్లో కోహ్లీ తన 50à°µ సెంచరీని సాధించడమే కాక… అత్యుత్తమ క్రీడాస్ఫూర్తికి&comma; పట్టుదలకు ఉదాహరణగా నిలిచాడని మోదీ ప్రశంసించారు&period; ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకోవడం అతని అంకిత భావానికి నిదర్శనమని చెప్పారు&period; భవిష్యత్ తరాలకు కోహ్లీ ఒక బెంచ్ మార్క్ ను నెలకొల్పుతూనే ఉన్నాడని కొనియాడారు&period; ఈ మ్యాచ్ లో అద్భుత బౌలింగ్ ప్రతిభను కనపరిచిన షమీకి అభినందనలను తెలుపుతున్నానని చెప్పారు&period; షమీ ఎంతో బాగా ఆడాడని… ఆయనను భవిష్యత్ తరాలు ఎంతో ఆదరిస్తాయని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.