97
ఏలూరు జిల్లా(Eluru) లో చేపల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో చేపలు చనిపోయాయి. ద్వారక తిరుమల మండలం గుండుగోలు గుంట గ్రామంలో చేపల చెరువును 4 లక్షలకు సత్యనారాయణ లీజుకు తీసుకున్నారు. అయితే రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చేపల చెరువులో విష ప్రయోగం చేశారు. ఉదయం చెరువు దగ్గరికి వెళ్లే చూసేసరికి చేపలు మొత్తం చనిపోయి ఉండటంతో సత్యనారాయణ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎవరో కావాలనే విష ప్రయోగం చేశారని చెరువు యజమాని వాపోతున్నారు. చేపలు మొత్తం చనిపోవడంతో సుమారు 10 లక్షలు నష్టం వాటిల్లందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సాయం చేయాలని సత్యనారాయణ కోరాతున్నాడు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.