గజ్వేల్ లో పొన్నం ప్రభాకర్ పర్యటన

Ponnam Prabhakar

Advertisements

&NewLine;<p>ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేశామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు&period; సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంత్రి పర్యటించారు&period; రవాణా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామన్నారు&period; తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల పరిమితి ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు&period; ఆరోగ్యశ్రీ అన్ని హాస్పిటల్స్ లో అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు&period; ఇచ్చిన అన్ని హామీలను వంద రోజుల్లోనే నెరవేరుస్తామని మంత్రి అన్నారు&period; గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఏ విధంగా ఇచ్చిందో అదే మాదిరిగానే ఇస్తామని స్పష్టం చేశారు&period; గజ్వేల్ నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిధ్యం వహించినా ఏనాడు ప్రజలను కలవలేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..