చోరీ సొత్తు స్వాధీనం..

police

Advertisements

&NewLine;<p>కడియం మండలం మురమండలో జరిగిన ట్రాక్టర్ చోరీ కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి కొంతమేర చోరీ సొత్తును స్వాధీన పరచుకున్నట్లు కడియం సిఐ తిలక్&comma; ఎస్సై మహమ్మద్ హస్పక్ తెలిపారు&period; ఈ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్లో వారు వివరాలను వెల్లడిస్తూ గత నెల 4వ తేదీన మురమండ గ్రామంలో గన్ని రామారావు తన కౌలు పొలం వద్ద ఉంచిన ట్రాక్టర్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిపోయారని&comma; ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని&comma; దీనిపై తన సిబ్బందితో ప్రత్యేక నిఘ ఏర్పాటు చేయగా&comma; ఈనెల 22వ తేదీన మురమండలో అనుమానస్పదంగా సంచరిస్తున్న పోతశెట్టి విజయ రెడ్డి&comma; పోతంశెట్టి సూర్య భాస్కర్ రెడ్డి&comma; పోతంశెట్టి సాయి రామ రెడ్డి&comma; పోసి శేఖర్ లను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ట్రాక్టర్ను తామే దొంగిలించినట్లు నేరం ఒప్పుకున్నారని తెలిపారు&period; అలాగే ఈ నేరంతో పాటు ఆగస్టు 31వ తేదీన కుతుకులూరు గ్రామానికి చెందిన మరొక ట్రాక్టర్ను&comma; పెనుమట్ర మండలం జుట్టుగ గ్రామంలో ట్రక్కుతో ఉన్న మరో ట్రాక్టర్ను దొంగిలించినట్లు ముద్దాయి ఒప్పుకున్నట్లు తెలిపారు&period; అలాగే గత నెలలో లొల్ల&comma; కేశవరం&comma; చిన ద్వారపూడి గ్రామాల్లో గల పొలాల కల్లాల వద్ద ఉంచిన 50 ధాన్యం బస్తాలను దొంగిలించి వాటిని ఓ రైస్ మిల్లులో అమ్మినట్లు&comma; అలాగే అదే నెలలో అనపర్తి మండలం అత్తమూరులో రోడ్డు ప్రక్కన ఉంచిన మూడు ట్రాక్టర్ ఐరన్ వీల్స్ ను దొంగిలించినట్లు ముద్దాయిలు తెలిపారని&comma; దొంగలించిన వీటిలో రెండు ట్రాక్టర్ ట్రక్కులను 40 వేలు&comma; 46 వేలకు పాత ఇనుప సామాను వ్యాపారికి విక్రయించినట్లు ముద్దాయిలు తెలిపారని&comma; వాటిలో రెండు ట్రాక్టర్లను&comma; ఐరన్ వీల్స్ ను&comma; రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనపరచుకుని నలుగురు ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు&period; ఈ కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన సిఐ తిలక్&comma; ఎస్ఐ మహమ్మద్ హస్పక్&comma; కడియం పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..