సింగరేణి ఎన్నికలపై విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది సింగరేణి ఎన్నికలపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలను డిసెంబర్ 27 కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ఇంధన శాఖ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నిక నిర్వహణకు సమయం కావాలని కోర్టును కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలను నిర్వహిస్తామని గతంలో చెప్పారని కోర్టు గుర్తుచేసింది. అయితే సింగరేణి ఎన్నికలు నిర్వహించడానికి సమయం కావాలని కోరడంతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ ఈనెల 21కి వాయిదా వేసింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు మొదటి నుంచి అవాంతరాలు, ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్ ఇచ్చేముందు ఒకసారి గుర్తింపు కార్మిక సంఘం,ఆతర్వాత యాజమాన్యం, మరోసారి రాష్ట్ర ప్రభుత్వం వేరు వేరుగా ఎన్నికలను వాయిదా వేయించాయి. చివరికి అక్టోబర్ లో వచ్చిన సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కూడా సింగరేణి గుర్తింపు ఎన్నికలకు అడ్డుగా మారాయి. ఈ నెల 21 న కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే విషయం సందిగ్ధత నెలకొంది.
వాయిదా పడ్డ సింగరేణి ఎన్నికల విచారణ…
73
previous post