ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి లో కార్మికుల యూనియన్ ఎన్నికలు ఉదయం 07 గంటల నుంచి ప్రారంభమైనాయి. సత్తుపల్లి లోని JVR ఓసి, కిష్టరం ఓసి, కోల్ ట్రాన్స్పోర్ట్ ఏరియా లలో పని చేసే సింగరేణి కార్మికులు 984 మంది ఈ రోజు ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు. సత్తుపల్లి సింగరేణి లో ఇప్పటివరకు అధికారంలో ఉన్న TGBKS యూనియన్ కాస్తా… ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ INTUC లో భారీగా కార్మికులు చేరడం జరిగింది. దీంతో ఇక్కడ INTUC యూనియన్ బలంగా ఏర్పడి సింగరేణి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు ఆయా యూనియన్ నాయకులు ముమ్మరంగా ప్రచారం చేశారు. కార్మిక సంఘాల మధ్య ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నడుమ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి.
singareni elections
సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీపి కబురు అందించారు. కార్మకులకు ఇంటి స్థలం ఇస్తామని, ఇల్లు కట్టుకోవడానికి రూ. 20 లక్షల వడ్డీలేని రుణం ఇప్పిస్తామని తెలిపారు. సింగరేణి దినోత్సవం రోజున సెలవుగా ప్రకటిస్తామని చెప్పారు. కార్మికుల వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఎలాంటి ఖర్చు లేకుండా కారుణ్య నియామకాలను చేపడతామని చెప్పారు. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్ టీయూసీ తరపున కొత్తగూడెంలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ హామీలను ప్రకటించారు.
సింగరేణిలో ఏడో విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 27న సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. సింగరేణిలో అన్ని పార్టీలు తమ సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమించాయి. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం సుమారు 40 వేల మంది కార్మికులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టియుసి కూడా విజయ కేతనం ఎగుర వేసేందుకు ఊవ్విళ్లూరుతోంది. బిఆర్ఎస్ అనుబంధ సంస్థ టిబిజికెఎస్, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియుసి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టియుసి యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ కొన సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిఐటియు, బిఎంఎస్, హెచ్ఎంఎస్ జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి ఉనికి కోసం ఉబలాటపడుతున్నాయి.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలో గెలుపే లక్ష్యంగా యూనియన్లు హామీలను కార్మికుల గనుల పై స్థానిక ఎమ్మెల్యేలు, యూనియన్లు ప్రచారం నిర్వహిస్తున్నాయి. సింగరేణి గుర్తిపు సంఘం ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ INTUC ఆధ్వర్యంలో శ్రీరామ్ పూర్ ఏరియా ఆర్కే 7, 7A గనులు వర్క్ షాప్ ల వద్ద ప్రచారం నిర్వహించారు. గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రచారం లో కార్మికులను కోరారు. ఆయన వెంట సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో 13 యూనియన్లు బరిలో నిలిచాయి.
సింగరేణి ఎన్నికలపై విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది సింగరేణి ఎన్నికలపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలను డిసెంబర్ 27 కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ఇంధన శాఖ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నిక నిర్వహణకు సమయం కావాలని కోర్టును కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలను నిర్వహిస్తామని గతంలో చెప్పారని కోర్టు గుర్తుచేసింది. అయితే సింగరేణి ఎన్నికలు నిర్వహించడానికి సమయం కావాలని కోరడంతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ ఈనెల 21కి వాయిదా వేసింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు మొదటి నుంచి అవాంతరాలు, ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్ ఇచ్చేముందు ఒకసారి గుర్తింపు కార్మిక సంఘం,ఆతర్వాత యాజమాన్యం, మరోసారి రాష్ట్ర ప్రభుత్వం వేరు వేరుగా ఎన్నికలను వాయిదా వేయించాయి. చివరికి అక్టోబర్ లో వచ్చిన సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కూడా సింగరేణి గుర్తింపు ఎన్నికలకు అడ్డుగా మారాయి. ఈ నెల 21 న కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే విషయం సందిగ్ధత నెలకొంది.
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్దం కావడానికి మరింత సమయం కావాలని తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించింది. గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. విచారణను ఈ నెల 18 కి వాయిదా వేసింది.
ఏఐటీయూసీతోనే సింగరేణి కార్మికుల హక్కులు సాధ్యమని కార్మికులందరూ ఏఐటీయూసిని గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కార్మికులను కోరారు. పెద్దపెల్లి జిల్లా రామగుండం ఏరియా వన్ జీడికే టు ఇంక్లైన్ పై ఏర్పాటు చేసిన గేటు మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన యూనియన్లు సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై లాభాల బాటలో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల పాలు చేశారని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిన ఘనత ఏఐటియూసికే దక్కిందని అన్నారు. సింగరేణిలో కొత్తగనుల ఏర్పాటు కోసం, ఉద్యోగాల కల్పన కోసం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈసారి తమ యూనియన్ కి అవకాశం ఇవ్వాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మడ్డి. ఎల్లయ్య, బ్రాంచి అధ్యక్షులు రంగు శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు రోజులు అవ్వకముందే సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి డేట్ ఫిక్స్ అయ్యింది. సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అది పోస్ట్ పోన్ చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో డిప్యూటీ లేబర్ కమిషనర్ సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు సమక్షంలో జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, విప్లవ కార్మిక సంఘాలైన ఐఎఫ్టీయూ, ఇతర సంఘాల నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి ఏకాభిప్రాయానికి రావడంతో 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికుల ఓటరు లిస్ట్‌ను ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు.
సింగరేణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నాయని, సింగరేణి కార్మికులను బార్డర్లో పనిచేసే సైనికులగా గౌరవిస్తామని పెద్దపల్లి జిల్లా రామగుండం కాంగ్రెస్ రామగుండం అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు. సింగరేణి కార్మికుల దీవెన యాత్రలో భాగంగా జీడికే టు ఎ బొగ్గు గని పై ఆయన కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని రాబోయే ఎన్నికల్లో బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని కార్మికులను కోరారు. అనంతరం గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిని కలిసి తనకు ఈసారి ఎన్నికల్లో అవకాశం కల్పించాలని చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.





Total views : 77957