కడప జిల్లా.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని టిడిపి నాయకులు ఎవరు ఏమీ చేయాలని అనుకోవడం లేదని, ఆయనకు ఎవరైనా హాని కలిగిస్తే, ఆయన ఫోను హ్యాక్ చేస్తే తాము ఒప్పుకోమని, ఈ విషయంలో ఎమ్మెల్యేకు మద్దతుగా ఉంటామని ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన ఫోన్ ను ఆస్ట్రేలియాలో ఉన్న కొందరు హ్యాక్ చేసి, తన పేరున నకిలీ ఖాతాతో ఫేస్బుక్ లో అశ్లీల చిత్రాలు పెడుతున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంపై తాము స్వాగతిస్తున్నామన్నారు. ఈ విషయంలో ఎవరున్నా శిక్షించాలని, పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఇదే సందర్భంలో గతంలో బీసీ నాయకుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ను బెదిరించిన కేసులో నిందితులను పట్టుకోవాలని, జిల్లా ఎస్పీనీ ఎమ్మెల్యే కోరాలన్నారు. అలాగే వైసిపికి చెందిన కొందరు వ్యక్తులను కూడా బెదిరించిన విషయంలో పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ప్రవీణ్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రవీణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
73
previous post