శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. సాయంత్రం 6.25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి 7 గంటలకు ప్రవేశించి సేద తీరి, కొన్ని రోజులు ఇక్కడే ఉండనున్నారు.
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రావడంతో అక్కడి నివాసంలో దాదాపు అన్ని పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షించి, పూర్తి చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 11 నుంచి 25 వరకు రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనను రద్దు చేశారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో బందోబస్తును కూడా భారీగా పెంచారు. ఈ పర్యటనలో భాగంగా భూదాన్ పోచంపల్లి వెళ్లనున్నారు. చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అదేవిధంగా పద్మశ్రీ, సంత్ కబీర్, ఇతర జాతీయ పురస్కార గ్రహీతలతో మాట్లాడి..పోచంపల్లి చేనత పరిస్థితులపై చర్చించనున్నారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అవార్డులు వచ్చిన 16 మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించారు. వారిలో ఎంపిక చేసిన ఐదు నుంచి 10 మందితో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. శ్రీరంజన్ హ్యాండ్లూమ్ యూనిట్లను సైతం సందర్శించి మగ్గాలు, మగ్గం నేసే ప్రక్రియ పరిశీలించనున్నారు.
రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి….
72
previous post