లోక్సభ ఎన్నికల షెడ్యూల్(Lok Sabha Election Schedule):
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కాసేపట్లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రధాని మోడీ (Prime Minister Modi)దేశ ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. తమ పదేళ్ల పాలనలో బీజేపీ సర్కార్(BJP Govt) సాధించిన విజయాలు, తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలను లేఖలో ప్రస్తావించారు. మరోసారి కలిసి పనిచేస్తామనే విశ్వాసం తనకుందంటూ రాబోయే ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రియమైన నా కుటుంబ సభ్యులారా.. అంటూ లేఖను ప్రారంభించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మన భాగస్వామ్యం దశాబ్దకాలం పూర్తి చేసుకునే దశలో ఉందని… 140 కోట్ల మంది భారతీయుల నమ్మకం, మద్దతు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. గత 10 ఏళ్లలో ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు మా ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళల జీవన నాణ్యతను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందన్నారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా పక్కా గృహాలు, అందరికీ విద్యుత్, నీరు, ఎల్పీజీతోపాటు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్యం అందించామని మోదీ లేఖలో పేర్కొన్నారు.
ఇది చదవండి: మమతా బెనర్జీ తలకు గాయం.. ఆస్పత్రిలో చికిత్స!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి