ఎన్డీయే కూటమి తొలి బహిరంగ సభ(First public meeting):
ఎన్డీయే కూటమి తొలి బహిరంగ సభకు పల్నాడు జిల్లా వేదిక కానుంది. బహిరంగసభ(Public meeting)కు చిలకలూరిపేట మండలం, బొప్పూడి వద్ద ‘ప్రజాగళం’ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సభలో చంద్రబాబు, పవన్, ఇతర నేతలు పాల్గొంటారు. అయితే మోదీ రాకతో అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఆరు హెలిప్యాడ్ల ఏర్పాటు చేశారు. ప్రధాని వస్తున్నందున ఎస్పీజీ నిఘాలో పనులు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో బహిరంగసభకు మోదీ వెళతారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి