ప్రైవేట్ కళాశాలలు (Private Colleges) :
నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రైవేట్ కళాశాలలు (Private Colleges) ఇష్టారాజ్యంగా సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తుండటం దుర్మార్గమైన చర్యని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని చైతన్య ఇంటర్మీడియెట్ కళాశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహించడంపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఇది చదవండి : పవన్ పై పోతిన మహేష్ సంచలన కామెంట్స్..
SFI, DYFI విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ప్రాంగణంలో నిరసనకు దిగారు. సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని ఇంటర్మీడియెట్ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. ప్రైవేట్ కాలేజీలు నిబంధనలు బేఖాతారు చేస్తున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు రమేష్, అనిల్ మండిపడ్డారు. విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న కార్పోరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి