సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డీ మార్ట్ (D Mart) లోని ఫుడ్ ప్రొడక్ట్ లో చచ్చిపోయిన ఎలుక కలకలం సృష్టించింది…
రామచంద్రాపురం పరిధిలోని డీమార్ట్ (D Mart) లో వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఓ కస్టమర్ పిల్లలు తినే స్నాక్స్ తీసుకునేందుకు ర్యాక్ వద్దకు వెళ్లగా చచ్చిపోయిన ఎలుక దర్శనమిచ్చింది. స్నాక్స్ ప్రొడక్ట్స్ తీసుకోగా అందులో నుంచి దుర్గంధం రావడంతో పరిశీలించిన కస్టమర్ కు క్షుణ్ణంగా పరిశీలించగా కుళ్ళిపోయిన ఎలుక కనిపించింది.దీంతో అవాక్కైనా సదరు కస్టమర్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఫుడ్ ప్రోడక్ట్ లో ఎలుక రావడంతో పక్కనున్న మిగిలిన కస్టమర్లు సైతం ఆందోళనకు దిగి స్టోర్ సిబ్బందిని నిలదీశారు.
డీమార్ట్ స్టోర్ లో సిబ్బంది నిర్లక్ష్యం..
నిత్యావసర సరుకులు కొనడానికి అనేకమంది కస్టమర్లు డీమార్ట్ కు వస్తారని అటువంటి స్టోర్ లో ఇంత నిర్లక్ష్యంగా సిబ్బంది వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. తప్పు జరిగిందని, చూసుకోలేదని డీ మార్ట్ నిర్వాహకులు దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం బయటకు, మీడియాకు చెప్పొద్దని సదరు కస్టమర్ ను బతిమాలడి బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడ్డారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ విషయంలో కలుగజేసుకొని అన్ని ప్రొడక్టుల క్వాలిటీ ని పరిశీలించి నిర్లక్ష్యంగా ఉన్న డీమార్ట్ యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించాలని పలువురు కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇది చదవండి : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ప్రకటన..
- నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది.
నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… - సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.
ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్… - వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.
వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున జరుగుతున్న గంజాయి సాగు కలకలం రేపింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆశ్రమంలో అక్రమంగా గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు.యాలాల మండలం గోవిందరావుపేట గ్రామ శివారులో హైదరాబాద్ బోరబండకు చెందిన పప్పులాల్ పది ఎకరాల భూమిని…
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: డీ మార్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో చచ్చిన ఎలుక కలకలం..







Total views : 223704