Saturday, July 18, 2026
News Navigation
Saturday, July 18, 2026
News Navigation

Breaking

Saturday, July 18, 2026
Home Latest News డీ మార్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో చచ్చిన ఎలుక కలకలం..

డీ మార్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో చచ్చిన ఎలుక కలకలం..

by Prakash
D Mart


సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డీ మార్ట్ (D Mart) లోని ఫుడ్ ప్రొడక్ట్ లో చచ్చిపోయిన ఎలుక కలకలం సృష్టించింది…

రామచంద్రాపురం పరిధిలోని డీమార్ట్ (D Mart) లో వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఓ కస్టమర్ పిల్లలు తినే స్నాక్స్ తీసుకునేందుకు ర్యాక్ వద్దకు వెళ్లగా చచ్చిపోయిన ఎలుక దర్శనమిచ్చింది. స్నాక్స్ ప్రొడక్ట్స్ తీసుకోగా అందులో నుంచి దుర్గంధం రావడంతో పరిశీలించిన కస్టమర్ కు క్షుణ్ణంగా పరిశీలించగా కుళ్ళిపోయిన ఎలుక కనిపించింది.దీంతో అవాక్కైనా సదరు కస్టమర్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఫుడ్ ప్రోడక్ట్ లో ఎలుక రావడంతో పక్కనున్న మిగిలిన కస్టమర్లు సైతం ఆందోళనకు దిగి స్టోర్ సిబ్బందిని నిలదీశారు.

డీమార్ట్ స్టోర్ లో సిబ్బంది నిర్లక్ష్యం..

నిత్యావసర సరుకులు కొనడానికి అనేకమంది కస్టమర్లు డీమార్ట్ కు వస్తారని అటువంటి స్టోర్ లో ఇంత నిర్లక్ష్యంగా సిబ్బంది వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. తప్పు జరిగిందని, చూసుకోలేదని డీ మార్ట్ నిర్వాహకులు దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ విషయం బయటకు, మీడియాకు చెప్పొద్దని సదరు కస్టమర్ ను బతిమాలడి బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడ్డారు. వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ విషయంలో కలుగజేసుకొని అన్ని ప్రొడక్టుల క్వాలిటీ ని పరిశీలించి నిర్లక్ష్యంగా ఉన్న డీమార్ట్ యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించాలని పలువురు కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇది చదవండి : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ప్రకటన..


  • ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుపై కాంగ్రెస్ నేత ఫైర్.
    ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వ్యాఖ్యలకు టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ భూములను దోచుకోవడం, భూ కబ్జాలకు పాల్పడటంలో శంభీపూర్ రాజు దిట్ట అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.కేటీఆర్ మోచేతి నీళ్లు తాగే శంభీపూర్ రాజుకు నిరుద్యోగుల…
  • రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేల విజ్ఞప్తి.
    పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తగిన నీటి కేటాయింపులు జరపాలని, జిల్లా ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి నేతృత్వంలోని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి…
  • Follow us on : FacebookInstagram, YouTube & Google News


    CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: డీ మార్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో చచ్చిన ఎలుక కలకలం..
    Advertisements

    You may also like

    Our Visitor

    041209
    Total views : 214641

    Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

    error: