Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Latest News ఎస్పీ కీలక ప్రకటన… వనం వీడి జనంలోకి రండి

ఎస్పీ కీలక ప్రకటన… వనం వీడి జనంలోకి రండి

by Prakash
SP Dr Sabreesh


కాలం చెల్లిన సిద్ధాంతాల కోసం ప్రాణాలు కోల్పోవద్దు – ములుగు జిల్లా ఎస్పీ డా శబరిష్ (SP Dr Sabreesh)…

ఎస్పీ డా శబరీష్ (SP Dr Sabreesh) : ప్రభుత్వ నిషేదిత CPI మావోయిస్టు పార్టీలో పని చేయుచున్న అజ్ఞాత మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి పోలీస్ ఎదట లొంగిపోవాలని ములుగు పోలీస్ వారి విజ్ఞప్తి. నిషేధిత సిపిఐ మావోయిస్టు సిద్ధాంతాలు కాలం చెల్లినవని వారి భావజాలం ప్రజల్లో ప్రాముఖ్యం కోల్పోయిందని మావోయిస్టు సిద్ధాంతాలను ప్రజలు నమ్మడం లేదు. కొంతమంది అగ్ర నాయకులు కాలం చెల్లిన సిద్ధాంతాలతో సామాన్య ప్రజల జీవితానికి విఘాతం కల్పిస్తూ ఇన్ఫార్మర్ నేపంతో అమాయకపు ఆదివాసులను చంపుతూ, మందు పాతరాలు పేల్చుతూ, తెలంగాణ మరియు చతిస్గడ్ సరిహద్దుల్లో అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తునారు.

లొంగిపోయిన మావోయిస్ట్ ల ఉపాధి మా భాద్యత..

తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించవచ్చు అనే అపోహ వదిలి తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసి వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులకు మరియు కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత నేరవేర్చే వ్యక్తిగా ఉండాలని, ములుగు జిల్లా పోలీస్ వారు కోరుచున్నారు. ములుగు జిల్లా నుండి అజ్ఞాతంలో సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేయుచున్న నాయకులు మరియు సభ్యులు ములుగు జిల్లా పోలీస్ ఎదుట లొంగిపోవాలి. లొంగిపోయిన వారికి వారి పేరు మీద ఉన్న నగదు రివార్డును మరియు జీవనోపాధి కోసం వారికి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ద్వారా కృషిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేయుచున్నాము.

జనజీవన స్రవంతిలో కలవండి మీ కుటుంబ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి..

సంప్రదించవలసిన నెంబర్లు :

ఎస్ పి ములుగు – 8712670100
ఓ ఎస్ డి ములుగు – 8712670101
ఏ ఎస్ పి ఏటూరునాగారం -8 712670104
డి ఎస్ పి ములుగు – 8712670103

ఎటువంటి భయాలకు లోను కావద్దు ధైర్యంగా లొంగిపోండి మీ సంరక్షణ – సంక్షేమం మా బాధ్యత. మీ కుటుంబంతో హాయిగా జీవించండి.

ఇది చదవండి : వివాదంలో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి..


  • సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
    ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
  • వికారాబాద్‌ జిల్లాలో ఆశ్రమం మాటున గంజాయి సాగు.
    వికారాబాద్ జిల్లాలో ఆశ్రమం మాటున జరుగుతున్న గంజాయి సాగు కలకలం రేపింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆశ్రమంలో అక్రమంగా గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు.యాలాల మండలం గోవిందరావుపేట గ్రామ శివారులో హైదరాబాద్ బోరబండకు చెందిన పప్పులాల్ పది ఎకరాల భూమిని…
  • Follow us on : FacebookInstagram, YouTube & Google News


    CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఎస్పీ కీలక ప్రకటన… వనం వీడి జనంలోకి రండి
    Advertisements

    You may also like

    Our Visitor

    042276
    Total views : 223720

    Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

    error: