తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై కాంగ్రెస్కు విజన్ ఉందని ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చిన ప్రియాంక గాంధీ ఖానాపూర్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గిరిజనులు, ఆదివాసీల కోసం ఎంతో చేశారని, ఆదివాసీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఇందిరాగాంధీ రాజకీయాలు చేశారని, రాజకీయాల్లోకి ఎందరో వస్తారు కానీ కొందరే గుండెల్లో నిలిచిపోతారన్నారు. ఇందిరాగాంధీ చనిపోయి 40 ఏండ్లు అయిన ఇప్పటికీ ఆమెను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. పోడు పట్టాల పేరుతో సీఎం కేసీఆర్ ఆదివాసీలను మోసం చేశారని మండిపడ్డారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలు తెలిసే సోనియా తెలంగాణ ఇచ్చారు, కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చి పదేళ్లు అయిన ప్రజల స్వప్నం నేరవేరలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంలో జీవితాలు మారుతాయని ఉద్యమకారులు కలలు కన్నారు కానీ అలాంటిదేమి జరగలేదని విమర్శలు గుప్పించారు.
Read Also..
Read Also..