Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana BRS, BJPల మధ్య ఘాటైన ప్రేమ బంధం – నారాయణ

BRS, BJPల మధ్య ఘాటైన ప్రేమ బంధం – నారాయణ

by Satya
K. Narayana

బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఘాటైన ప్రేమ బంధం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ ఆరోపించారు. తొమ్మిదిన్నరేళ్లు కేంద్రంలో బీజేపీ, తెలంగాణ బీఆర్ఎస్‌ అధికారంలోకి ఉన్నాయన్నారు. ఇన్నాళ్లు ఏం చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలు విడుదల చేస్తూ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ బీజేపీ కొత్తగా బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అసలు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ వ్యక్తి బండి సంజయ్‌ను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవితపై బండి సంజయ్‌ తీవ్రంగా విమర్శలు చేసినందుకే జీర్ణించుకోలేకనే తొలగించారని అన్నారు. దేశంలో అబద్దాలు చెప్పే వ్యక్తుల్లో ప్రధాని మోడీ నెంబర్ వన్, కేసీఆర్ నెంబర్ టూ అని ఎద్దేవా చేశారు. గతంలో సీఎం కేసీఆర్ తన కొడుకును సీఎం చేస్తానని ఎక్కడా చెప్పలేదని మరి ఇప్పుడు పలు ఇంటర్వ్యూలలో ఆ విషయం చెప్పానని ప్రకటనలు చేస్తూ సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ యువతను దగా చేశారని నారాయణ మండిపడ్డారు. కాంపిటీటివ్ ఎగ్జామ్ పెట్టడంలో, టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించడంలో, పేపర్ లీకేజీలు, కోర్టు కేసుల పేరిట ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బండారు సురేందర్ రెడ్డి.. బజార్లో ఉల్లిగడ్డలు అమ్మినట్టు ఆ పార్టీ టికెట్లు నమ్ముతున్నారని విమర్శించారు. కొత్తగూడెం టికెట్‌ను జలగం వెంకట్రావుకు 10 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

Advertisements

You may also like

Our Visitor

014286
Total views : 79738

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.