పాదరసంలా కదులుతూ పాయింట్లు కొల్లగొట్టేవాళ్లు ఒకరు చిరుతలా మీదపడి ప్రత్యర్థిని ఒడిపట్టేవాళ్లు ఇంకొకరు. ఎంతమంది చుట్టేసినా బయటకి జారిపోయే డుబ్కీ కింగ్ మరొకరు! వీరంతా ఆడేది ఒకే వేదికలో! 12 జట్లు పోరాడేది ఒకే కప్ కోసం! మొదలుకాబోతోంది ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10 గత తొమ్మిదేళ్లుగా అశేష అభిమానులను అలరించిన ఈ లీగ్ నేటినుంచి మరో సీజన్‌కు సిద్ధమైంది. ఇక అభిమానులకు పండగే! అహ్మదాబాద్‌లో తెలుగు టైటాన్స్-గుజరాత్ జెయింట్స్‌తో టోర్నీ మొదలు కానుంది. తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్, పుణెరి పల్టాన్, పట్నా పైరేట్స్, జైపుర్ పింక్ పాంథర్స్, హరియాణా స్టీలర్స్, గుజరాత్ జెయింట్స్, దబాంగ్ దిల్లీ, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, యూపీ యోధ, యు ముంబా కప్పు వేటలో ఉన్నాయిడిసెంబర్ 2న మొదలయ్యే ఈ టోర్నీలో లీగ్ దశలో మొత్తం 132 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు 2024 ఫిబ్రవరి 21న ముగుస్తాయి. ప్లేఆఫ్స్, ఫైనల్ తేదీలు తర్వాత ప్రకటిస్తారు. హైదరాబాద్ వేదికగా గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 19 నుంచి 24 వరకు 11 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో తెలుగు టైటాన్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది.
303
previous post