గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో మా వ్యవసాయ భూములను లక్కోవద్దని రైతులు అధికారులను డిమాండ్ చేశారు. లక్షెట్టిపేట – మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో బాగంగా తమ వ్యవసాయ భూములను లాక్కోవడాని ప్రయత్నిస్తున్నారని రైతులు రోడ్డెక్కారు. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట, హజీపుర్ మండల గ్రామాల రైతులు మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో తమ విలువైన భూములను కోల్పోయామని అరకొర నష్టపరిహారం ఇచ్చి తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో మరోసారి మా భూములను లాక్కోవాలని నాయకులు, అధికారులు చూస్తున్నారని వారు మండిపడ్డారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం గతం లో చేసిన సర్వే ఆధారంగానే నిర్మించాలని ఉన్న కొందరు రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు, నాయకుల స్వలాభం కోసం నాలుగు వరసల హైవే రోడ్డు నిర్మాణం కోసం మరో సర్వే నిర్వహించి తమ విలువైన భూములను నాశనం చేయడానికి పూనుకున్నారని అన్నారు. దీంతో అనేకమంది రైతు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి స్వలాభం కోసం రోడ్డు నిర్మాణ సర్వేలు ఎందుకు మార్చారో అని అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మా సమస్యలు చెప్పుకుందామని ఆర్డిఓ కార్యాలయానికి వస్తే కనీసం మా వినతి పత్రాన్ని కూడా అధికారులు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా గ్రీన్ ఫీల్డ్ హైవే రూట్ మ్యాప్ ను మార్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సుమారు 12 గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన…
85
previous post