హైదరాబాద్ అబిడ్స్ ఓ హోటల్ లోని బిర్యానీ విషయం లో తలెత్తిన గొడవ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నూతన సంవత్సర సందర్భంగా… దూల్ పెట్ కు చెందిన కొందరు వ్యక్తులు రాత్రి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే బిర్యానీ, మటన్ సరిగా ఉడకలేదని, తాము పూర్తి డబ్బులు చెల్లించలేమని హోటల్ వెయిటర్లతో వినియోగదారులు గొడవకు దిగారు. దింతో ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్రమైంది. మొదటగా హోటల్ వెయిటర్ల పై దాడికి దిగడంతో, వెయిటర్లు వినియోగదారులపై కర్రలతో దాడికి దిగారు. కొంతమంది వినియోగదారులకు తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. హోటల్ యజమాని పై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను మధ్య మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే స్పందించి.. అబిడ్స్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడి గ్రాండ్ హోటల్ వెయిటర్లు, యజమాని పై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. లేనిపక్షంలో హోటల్‌కు నిప్పు పెడతామని హెచ్చరించారు.
హోటల్ లో బిర్యానీ కోసం గొడవలు..
98
previous post