కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు కాంగ్రెస్ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది.
ఇది చదవండి: యూసీసీ చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో బీజేపీ ప్రభుత్వం
రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్నాళ్ల క్రితం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలచుకోలేదని, నియోజకవర్గానికి న్యాయం చేయలేనని సోనియా పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.