165
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నగర వాసులంతా సొంతూళ్లకు పయనమయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రత్యేక రైల్లు నడుపుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. జూబ్లీ బస్ స్టేషన్ నుండి వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు సైతం తరలివస్తుండడంతో రద్దీ నెలకొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ లలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.