అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా సాలూరు రైల్వే స్టేషన్‌..

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా సాలూరు రైల్వే స్టేషన్‌

Advertisements

<p>పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు రైల్వే స్టేషన్… ఒకప్పుడు ఈ ప్రాంత ప్రజల జీవనాడిగా నిలిచిన కేంద్రం&period; ఇప్పుడు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది&period; బ్రిటిష్ కాలం నుంచే రైళ్ల రాకపోకలతో గిరిజన ప్రాంతాలకు ఆర్థికంగా బలాన్ని ఇచ్చిన ఈ స్టేషన్&comma; నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం ఆందోళన కలిగిస్తోంది&period; గోధుమలు&comma; సిమెంట్ వంటి సరుకులు రైళ్ల ద్వారా వచ్చి లారీలలో లోడవుతూ పలు రాష్ట్రాలకు తరలించేవారు &period; దీని ద్వారా వందలాది కార్మిక కుటుంబాలు ఉపాధి పొందేవి&period; కానీ 2003లో నష్టాల పేరుతో రైళ్లను నిలిపివేయడం&comma; తరువాత రైలు బస్సును కూడా నిలిపివేయడం వల్ల సాలూరు ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయింది&period; రైల్వే సిబ్బంది లేకపోవడంతో క్వార్టర్స్ శిథిలావస్థకు చేరుకోవడం&comma; దొంగతనాలు పెరగడం పరిస్థితిని మరింత దిగజార్చాయి&period; స్థానిక ప్రజలు పునరుద్ధరణ కోసం ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది&period;<&sol;p>&NewLine;<p>సాలూరు రైల్వే స్టేషన్‌ పరిస్థితి ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజల ఆవేదనకు ప్రతీకగా మారింది&period; ఒకప్పుడు రైల్వే రాకపోకలతో కళకళలాడిన ఈ స్టేషన్&comma; నేడు నిశ్శబ్దంగా మారి అసాంఘిక శక్తులకు కేంద్రంగా మారడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది&period; గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>రైల్వే గోడౌన్ ఆధారంగా జీవనం సాగించిన కార్మికులు ఉపాధి కోల్పోయి వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది&period; రైల్వే క్వార్టర్స్ ఖాళీగా ఉండటంతో అవి శిథిలాలుగా మారి దొంగల బారిన పడటం జరుగుతుంది &period; రైల్ పునరుద్ధరణ పనులు జరిగి 2018లో ట్రైల్ రన్ నిర్వహించినా&comma; ఇప్పటివరకు రైళ్లు పునరుద్ధరించకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది&period;దీనికి సంబంధించిన ఫైల్ భువనేశ్వర్ DRM వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది &period; స్థానిక ప్రజలు ఎన్నిసార్లు వినతులు చేసినా&comma; ఫైళ్లు ఒక కార్యాలయం నుంచి మరొక కార్యాలయానికి తిరుగుతూనే ఉన్నాయి&period; పాలకులు చొరవ చూపకపోతే ఈ ప్రాంత అభివృద్ధి పూర్తిగా నిలిచిపోతుందన్న ఆందోళన పెరుగుతోంది&period; దీనిపై స్థానికుల నుంచి ఫోన్ ఇన్ లో మరింత వివరాలు తెలుసుకుందాం &period;&period;<&sol;p>&NewLine;<p>సాలూరు రైల్వే స్టేషన్‌ కథ… అభివృద్ధి నుంచి నిర్లక్ష్యానికి పడిపోయిన దారుణ ఉదాహరణగా నిలుస్తోంది&period; బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ స్టేషన్&comma; సాలూరు పరిసర గ్రామాల అభివృద్ధికి కీలక పాత్ర పోషించింది&period; రైళ్ల ద్వారా సరుకుల రవాణా&comma; ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతం ఆర్థికంగా బలపడింది&period; కానీ నష్టాల పేరుతో రైళ్లను నిలిపివేయడం&comma; తరువాత కరోనా సమయంలో రైలు బస్సును కూడా ఆపేయడం వల్ల సాలూరు ప్రజలు పూర్తిగా ఇబ్బందుల్లో పడ్డారు&period; రైల్వే సిబ్బంది బదిలీ కావడంతో క్వార్టర్స్ ఖాళీగా మారి శిథిలావస్థకు చేరుకున్నాయి&period; ఈ పరిస్థితిని ఉపయోగించుకుని అసాంఘిక కార్యకలాపాలు పెరగడం మరింత ప్రమాదకరంగా మారింది&period; రైల్వే అధికారులు ట్రైల్ రన్స్ నిర్వహించినా&comma; అమలు చేయకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది&period; ఇప్పటికైనా కేంద్రం&comma; రాష్ట్రం కలిసి చర్యలు తీసుకుంటేనే సాలూరుకు మళ్లీ రైలు సౌకర్యం కలిగే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..