ఐపీఎల్-17(IPL-17)లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు ఎదురులేకుండా పోయింది. మైదానంలో అడుగుపెడితే విజయమే అన్నట్టుగా ఆ జట్టు దూకుడు కొనసాగుతోంది. లక్నో వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను 3 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(76), దీపక్ హుడా(50) సత్తాచాటారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనంతరం లక్ష్యాన్ని రాజస్థాన్ అలవోకగా ఛేదించింది. 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కెప్టెన్ శాంసన్(71 నాటౌట్), ధ్రువ్ జురెల్(52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ సీజన్లో రాజస్థాన్ చేతిలో ఓడటం లక్నోకు ఇది రెండోసారి. రాజస్థాన్‌కు వరుసగా ఇది నాలుగో గెలుపు. మొత్తంగా 8వది. దీంతో ఆ జట్టు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది.
- వరల్డ్ చెస్ ఛాంపియన్ గా భారతీయుడుప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విశ్వ విజేతగా భారత గ్రాండ్ మాస్టర్, యువ కెరటం దొమ్మరాజు గుకేశ్ నిలిచాడు.ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, డింగ్ లిరెన్ ను ఓడించి ఛాంపియన్‌గా నిలవాలన్న కల నెరవేర్చుకున్నాడు. ఈ విజయంతో గుకేశ్ ప్రపంచ చెస్…
- IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన పంత్..దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో భారత స్టార్ ప్లేయర్లు చరిత్రను తిరగ రాస్తున్నారు. వేలం స్టార్టింగ్ లోనే బౌలర్ అర్షదీప్ సింగ్‌ను పంజాబ్ జట్టు 18 కోట్లకు ఆర్టీఎమ్ చేసుకొగా.. అనంతరం స్టార్ బ్యాటర్ శ్రేయస్…
- సెంచరీతో కొత్త రికార్డును సృష్టించిన విరాట్ కోహ్లీబోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సృష్టించాడు. సాలిడ్ డిఫెన్స్ తో పాటు అవసరమైన సమయంలో బ్యాట్ ను మంత్రడండంలా తిప్పుతూ మ్యాజికల్ షాట్స్ ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీ దాటేసి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.