సామూహిక వివాహ వేడుకపై విరుచుకుపడ్డ పెనుగాలులు..

Advertisements

<p>రాజస్థాన్‌లో భీకరగాలులు బీభత్సం సృష్టించాయి&period; టోంక్ జిల్లాలో ఘనంగా జరుగుతున్న ఓ సామూహిక వివాహ వేడుకపై విరుచుకుపడ్డాయి&period; 36 జంటల పెళ్లి కోసం ఏర్పాటు చేసిన వేదికను &period;&period;భీకర దుమ్ము తుపాను నిమిషాల్లోనే ఛిన్నాభిన్నం చేసింది&period; ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి&period; ధాకడ్ కమ్యూనిటీకి చెందిన 36 జంటల కోసం ఓ బహిరంగ మైదానంలో సామూహిక వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు&period; ఉదయం నుంచి సందడిగా ఉన్న ఆ ప్రాంతంలో&period;&period; వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది&period; బలమైన గాలులు కాస్తా భయానక సుడిగాలిగా మారి వేదికపై విరుచుకుపడింది&period; ఈ పెనుగాలి ధాటికి వేదిక కోసం వేసిన టెంట్లు గాల్లోకి ఎగిరిపడ్డాయి&period; సమీపంలోని పొలాల్లోకి చెల్లాచెదురుగా కొట్టుకుపోయాయి&period; ప్రాణభయంతో జనం పరుగులు తీశారు&period; ఈ క్రమంలో టెంట్ల ఇనుప పైపులు మీద పడటంతో పలువురు మహిళలు&comma; పిల్లలకు గాయాలయ్యాయి&period; దుమ్ము తుపాను అనంతరం భారీ వర్షం కురవడంతో పెళ్లి సందడి కాస్తా ఆందోళనకరంగా మారింది&period; ఐతే పశ్చిమ అలజడుల కారణంగా రాజస్థాన్‌లో ఇటీవల వాతావరణం అసాధారణంగా ఉంటోందని&comma; రానున్న రోజుల్లో మరిన్ని దుమ్ము తుపానులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…

ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..