135
యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ భూతం రాజ్యమేలుతోంది. భువనగిరి ఎస్.ఓ.టి. పోలీసులు కల్తీ పాలు తయారు చేసే ముఠా ఆటకట్టించారు. భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల, గౌస్ కొబ్లండ గ్రామాల్లో కల్తీ పాల దందా జోరుగా సాగుతోంది. పక్కా సమాచారంతో కాపుకాసిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 350 లీటర్ల కల్తీ పాలు స్వాధీనం చేసుకున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్లు సీజ్ చేశారు. కల్తీపాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. స్థానిక పోలీసులకు సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదులు సైతం వెళ్లాయి. దీంతో ప్రత్యేక టీంను రంగంలోకి దించారు. నిందితులను అరెస్ట్ చేశారు.