ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజార్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వాసవి యూత్ క్లబ్ మార్కాపురం వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రంగోలి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముగ్గుల పోటీలో మహిళామణులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు రంగురంగులతో అల్లికలు అల్లిన రంగోలీలకు మున్సిపల్ చైర్మన్ సతీమణి చిల్లంచర్ల లీలావతి, నారాయణ లావణ్య, బైసని ప్రశాంతి, తదితరులు న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ ఎం వి రమేష్ బాబు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు వాసవి యూత్ క్లబ్ మార్కాపురం వారు మరియు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందచేశారు. వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి యూత్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, సెక్రటరీ కార్తీక్, ట్రెజరత్ కిషోర్ బాబు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వాసవి యూత్ క్లబ్, సభ్యులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు…
110
previous post