Tirumala:
సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిత్యం అన్నప్రసాదాలని నీటిని అందించే విధంగా టీటీడీ ఏర్పాటు చేసింది అలాగే ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ,సి వి ఎస్ ఓ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు.ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. కాగా, సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు. Read Also..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.