దేశంలో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రతిపాదనలు చేసింది..

Advertisements

<p>దేశంలో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రతిపాదనలు చేసింది&period; రూ&period;10&comma;000కు పైబడిన ఆన్‌లైన్ లావాదేవీలను ఒక గంట పాటు హోల్డ్ లో ఉంచే విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది&period; ఈ మేరకు ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసి&comma; ప్రజల నుంచి అభిప్రాయాలను కోరింది&period; ఈ ప్రతిపాదన ప్రకారం&comma; ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు రూ&period;10&comma;000 కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు పంపితే&comma; ఆ లావాదేవీ వెంటనే పూర్తికాదు&period; బదులుగా&comma; పంపిన వారి వద్ద గంట పాటు నిలిచిపోతుంది&period; ఈ సమయంలో&comma; డబ్బు పంపిన వ్యక్తికి తన లావాదేవీని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది&period; లావాదేవీ అనుమానాస్పదంగా అనిపిస్తే&comma; బ్యాంకు మరోసారి నిర్ధారణ కోరుతుంది&period; వ్యాపార చెల్లింపులు&comma; ఈ-మాండేట్లు&comma; నాచ్ లావాదేవీలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p>2025 నాటికి దేశంలో డిజిటల్ మోసాల విలువ రూ&period;22&comma;930 కోట్లకు చేరడంతో ఆర్బీఐ ఈ చర్యలకు ఉపక్రమించింది&period; మొత్తం మోసాల విలువలో సుమారు 98&period;5 శాతం&period;&period; రూ&period;10&comma;000కు పైబడిన లావాదేవీల ద్వారానే జరుగుతున్నాయని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది&period; సోషల్ ఇంజినీరింగ్ ద్వారా బాధితులపై ఒత్తిడి తెచ్చి మోసగాళ్లు డబ్బు బదిలీ చేయిస్తున్నారని&comma; ఈ గంట సమయం ఆలస్యం వల్ల బాధితులకు ఆలోచించుకునే అవకాశం దొరుకుతుందని ఆర్బీఐ పేర్కొంది&period; ఇదే చర్చా పత్రంలో ఆర్బీఐ మరికొన్ని ప్రతిపాదనలను కూడా చేర్చింది&period; 70 ఏళ్లు పైబడిన వృద్ధులు&comma; దివ్యాంగులు రూ&period;50&comma;000కు మించి చేసే లావాదేవీలకు వారు నామినేట్ చేసిన &&num;8216&semi;విశ్వసనీయ వ్యక్తి&&num;8217&semi; ఆమోదం తప్పనిసరి చేయాలని సూచించింది&period; ఖాతాల్లోకి వచ్చే పెద్ద మొత్తాల జమలపై సమీక్ష&comma; అలాగే అన్ని డిజిటల్ చెల్లింపులను ఒకేసారి నిలిపివేసే &&num;8216&semi;కిల్ స్విచ్&&num;8217&semi; వంటివి ఇతర ప్రతిపాదనల్లో ఉన్నాయి&period; ఈ ప్రతిపాదనలపై మే 8à°µ తేదీలోగా అభిప్రాయాలు తెలియజేయాలని వాటాదారులను ఆర్బీఐ కోరింది&period; వచ్చిన స్పందనల ఆధారంగా మార్గదర్శకాలను జారీ చేయనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.