టీమిండియా మాజీ ఆటగాళ్లు శ్రీశాంత్-గౌతం గంభీర్ ఇద్దరూ ఇటీవల వార్తల్లోకి ఎక్కారు. లెజండ్స్ లీగ్ క్రికెట్ 2023లో భాగంగా ఇటీవల సూరత్‌లోని లాలాభాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ఇండియా కేపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా గంభీర్, శ్రీశాంత్ మైదానంలోనే ఒకరికొకరు కలబడ్డారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే గంభీర్ తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని శ్రీశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గంభీర్‌కు సహచరులను గౌరవించడం తెలియదని ఆరోపించాడు. ఐపీఎల్లో ఆర్సీబీ- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి గొడవే జరిగింది. కోహ్లీతో నవీనుల్ హక్, గంభీర్ వాగ్వివాదానికి దిగారు. ఇది అప్పట్లో సంచలనమైంది. ఈ ఘటనపై గంభీర్ తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ. మెంటార్‌గా తన జట్టు ఆటగాళ్లకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉంటుందన్నాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకునే హక్కు తనకు ఉండదని కానీ, మ్యాచ్ ముగిశాక తమ ఆటగాళ్లతో ఎవరైనా వాగ్వివాదానికి దిగితే వెళ్లి అడ్డుకోవడం తన బాధ్యత అని చెప్పుకొచ్చాడు. అటువైపు ఉన్నది ఎవరైనా సరే తమ ప్లేయర్లను కాపాడుకోవడం తన బాధ్యత అని తేల్చి చెప్పాడు.
ఇటీవల శ్రీశాంత్‌తో మైదానంలో గంభీర్ గొడవ
68
previous post