తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. పదేళ్లు కేసీఆర్కు అవకాశం ఇస్తే.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ కు మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ పరిస్థితిని ఊహించలేమన్నారు. వనపర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.తెలంగాణ తీసుకొచ్చామని చెప్పిన వారికి పదేళ్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎంతో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. మరి అలాంటి కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలపై లేదా? భారాసకు మరో అవకాశం ఇచ్చే విషయంలో ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం’’ అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలు పక్కా – రేవంత్ రెడ్డి
108
previous post