ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డి లేఖ

Revanth Reddy's letter inviting him to the oath taking ceremony

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు&period; తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తూ లేఖ రాశారు&period; ప్రజా ప్రభుత్వ స్వీకారానికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు&period; ఈ మేరకు ఆయన బుధవారం లేఖను విడుదల చేశారు&period; తెలంగాణ ప్రజలకు అభినందనలు… విద్యార్థుల పోరాటం&comma; అమరుల త్యాగం&comma; సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేరే ఇందిరమ్మ రాజ్యస్థాపనకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు&period; రాష్ట్రంలో ప్రజాస్వామ్య&comma; పారదర్శక పాలన అందించేందుకు బలహీన వర్గాలు&comma; దళిత&comma; గిరిజన&comma; మైనార్టీ&comma; రైతు&comma; మహిళ&comma; యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7à°¨ మధ్యాహ్నం 1&period;04 నిమిషాలకు ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుందన్నారు&period; ఈ మహోత్సవానికి రావాల్సిందిగా అందరికీ ఆహ్వానం పంపుతున్నామని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు&period; ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో రేవంత్‌ చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు&period; గురువారం మధ్యాహ్నం జరగనున్న ప్రమాణస్వీకారానికి రావాలని ఏఐసిసి చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు సోనియాగాంధీ&comma; రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు&period; కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు&comma; పలు రాష్ట్రాల సీఎంలు&comma; మాజీ సీఎంలు&comma; వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది&period; అలాగే ఏపీ సీఎం వైఎస్ జగన్&comma; తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు చంద్రబాబునాయుడుకి&comma; కెసిఆర్ ను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు&period; కాంగ్రెస్ గెలుపులో కీలకపాత్ర పోషించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య&comma; ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించారు&period; వీరితోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్&comma; తెలంగాణ అమరవీరుల కుటుంబాలకూ టీపీసీసీ ఆహ్వానం పంపింది&period; టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం&comma; ప్రొఫెసర్ హరగోపాల్&comma; కంచె ఐలయ్యతో పాటు వివిధ కుల సంఘాల నేతలు&comma; సినీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.