89
తెలంగాణ లోని స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితి గురించి రేవంత్ రెడ్డి లేఖలో వివరించారు. జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తనకు స్థానిక ప్రజాప్రతినిధుల ఇబ్బందులు తెలుసన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీ అవస్థలు మీకు జరిగిన అవమానాలుగుర్తించానన్నారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయన్నారు. ఈ ఎన్నికలతో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. జెండాలకు, అజెండాలకు అతీతంగా మీ పల్లె రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.