నర్సీపట్నంలో ఆర్టీసీ స్థలంపై భారీ వివాదం..

Advertisements

<p>అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన కోట్లు విలువ చేసే స్థలం వివాదాస్పదంగా మారింది&period; 1983లో సేకరించిన ఈ స్థలంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం జరిగింది&period; అయితే కాలక్రమేణా బలిఘట్టం బైపాస్ రోడ్డు నిర్మాణంతో స్థలం రెండు భాగాలుగా విడిపోయింది&period; రోడ్డుకు అవతల పివిఆర్ కాంప్లెక్స్ నుంచి శారద నగర్ వరకు సుమారు 20 సెంట్ల స్థలం మిగిలింది&period; గతంలో అక్కడ నివసించిన కుటుంబాన్ని బలవంతంగా ఖాళీ చేయించారు &period;అక్కడ యూనియన్ కార్యాలయానికి కూడా అనుమతి నిరాకరించారు&period; కానీ ప్రస్తుతం అదే స్థలంలో ప్రైవేట్ యాజమాన్యాలు ఆక్రమణలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; మినీ శ్రీ కన్య థియేటర్ సమీపంలో ఉన్న ఆర్టీసీ రాయి తొలగించడంతో పాటు &comma; ఎటిఎం సెంటర్ &comma; బ్యాంక్ ముందు వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు &period;ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడం పై విమర్శలు వస్తున్నాయి &period;<&sol;p>&NewLine;<p>ఇక అత్యంత వివాదాస్పద అంశం ఏంటంటే &period;&period; ఆర్టీసీ స్థలాల విక్రయం&period; ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్టీసీ స్థలాలను అమ్మకూడదు&comma; అవసరమైతే లీజుకు ఇవ్వవచ్చు&period; కానీ నర్సీపట్నంలో అధికారులు దర్జాగా స్థలాలను అమ్మేశారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి&period; రెండు స్థలాలు విక్రయించగా&comma; మిగిలిన వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన వారికి ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది&period; ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు&period; మరోవైపు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గతంలో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు ఇవ్వడాన్ని కూడా అడ్డుకున్న సందర్భం ఉంది&period; ఈ నేపథ్యంలో అధికారులు స్వేచ్ఛగా స్థలాల విక్రయానికి పాల్పడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది&period; ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు చర్యలు లేకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది&period; వెంటనే ఆక్రమణలను తొలగించి&comma; బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..