ప్రయాణికులు ప్రయాణించుతూన్న ఆర్థీసీ బస్సు ప్రమాదానికి గురి అవ్వటం చాలా భాధాకరమని, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఈరోజు ఉదయం పదిగంటల సమయంలో చల్లపల్లి మండలం శివారు మేకావారిపాలెం గ్రామంలో నడకుదురు ప్రధాన రహదారిపై ఆర్టీసీ కరకట్ట ఎక్స్ ప్రెస్ బస్సు ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ముందుగా చల్లపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారితో మాట్లాడి వారి గాయాల గురించి ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో నలుగురు గాయాలకు గురికాగా వారికి ఇక్కడ ప్రాథమిక చికిత్స అందించారని, మెరుగైన చికిత్స నిమిత్తం మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. అనంతరం ఘటనా స్థలికి చేరుకొని బస్సును పరిశీలించి, ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు అక్కడ ఉన్న గ్రామస్తులును, పోలీసు అదికారులను అడిగితేలుసుకున్నారు.
ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం..
105
previous post