77
కృష్ణా జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. పంట బోదిలోకి దూసుకుపోయింది. చల్లపల్లి మండలం మేకవారిపాలెం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. తరచూ ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకున్నా ఎందుకు ఇదే ప్రాంతంలో జరగుతున్నాయన్న దానిపై అధికారులు ఆరా తీయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు.