మంత్రాలయం టిడిపి ఇంచార్జీ పి తిక్కరెడ్డికి టికెట్ అధిష్టానం కేటాయించక పోవడంతో మంత్రాలయంలో భవిష్యత్తు ప్రణాళిక కోసం టిడిపి నేత పి తిక్కరెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. టిడిపి శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నంకు పాల్పడ్డారు. మరో వ్యక్తి గోడకు తల బాదుకొని ఆత్మహత్యయత్నంకు పాల్పడ్డాడు. రక్త స్రావం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిరసనలు, ధర్నాలు వెలు వెత్తాయి. టిడిపి శ్రేణులు రోడ్డుపై బైఠాయించి టైర్లు దగ్ధం చేశారు. మంత్రాలయం మండలంలో టిడిపి నాయకులు సభ్యత్వంకు, పార్టీ పదవులకు రాజీనామాలు చేసి రాఘవేంద్ర సర్కిల్ లో ధర్నా నిర్వహించారు. మంత్రాలయం ఇంచార్జీ పి తిక్కరెడ్డిని తప్పించి గత రెండు నెలల క్రితం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టిడిపి పార్టీలోకి వచ్చిన బిసి నాయకుడు ఎన్ రాఘవేంద్ర రెడ్డి కి టిడిపి ఆధిష్టానం టికెట్ కేటాయించడంతో టిడిపి నేత పి తిక్కరెడ్డి వర్గాలు రాజీనామాలు చేస్తున్నారు. ఆధిష్టానం ఆలోచించి తిక్కరెడ్డికి టికెట్ కేటాయించాలని ఓడిన 10 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటూ సేవలు చేస్తున్నారని తెలిపారు.
టిడిపి టికెట్ కోసం రచ్చ…
97
previous post