ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై విరుచుకుపడిన రష్యా

Russia attacked Ukraine's capital Kiev

Advertisements

&NewLine;<p>ఉక్రెయిన్ పై రష్యా 2022 ఫిబ్రవరిలో దాడులు మొదలుపెట్టింది&period; ఈ క్రమంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై విరుచుకుపడింది&period; ఈ దాడుల కోసం ఇరాన్ తయారీ షాహెద్ డ్రోన్లను రష్యా సైన్యం ఉపయోగించింది&period; ఈ దాడులను ఉక్రెయిన్ వాయుసేన కమాండర్ మికోలా ఒలెష్చుక్ నిర్ధారించారు&period; రష్యా బలగాల ప్రధాన లక్ష్యం కీవ్ నగరమేనని వెల్లడించారు&period; ఈ దాడుల కోసం రష్యా సైన్యం 75 షాహెద్ డ్రోన్లను రంగంలోకి దించింది&period; అయితే వాటిలో 74 డ్రోన్లను తాము కూల్చివేశామని ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ ప్రకటించుకుంది&period; ఈ దాడులపై కీవ్ నగర పాలకుడు సెర్హీ పోప్కో స్పందించారు&period; ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలయ్యాక ఇంత భీకర స్థాయిలో దాడులు ఎప్పుడూ జరగలేదని తెలిపారు&period; ఈ దాడుల్లో కీవ్ నగరంలోనే అనేక భవనాలు ధ్వంసం అయ్యాయి&period; ఐదుగురు పౌరులకు గాయాలయ్యాయి&period; చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది&period; 17 వేల మంది అంధకారంలో ఉన్నట్టు ఉక్రెయిన్ ఇంధన శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది&period; వేకువ జామున నాలుగు గంటల నుంచి రష్యా దాడులు జరగ్గా దాదాపు 6 గంటల పాటు విధ్వంసం కొనసాగినట్టు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి&period; మధ్యాహ్నం తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్టు వెల్లడించాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్