పోలీసుల చేతకానితనం వల్లే సోషల్‌ మీడియాలో అసభ్య, అవమానకర పోస్టులు పెడుతూ పేట్రేగిపోతున్నారని హైకోర్టు మండిపడింది…

Advertisements

<p>పోలీసుల చేతకానితనం వల్లే సోషల్‌ మీడియాలో అసభ్య&comma; అవమానకర పోస్టులు పెడుతూ పేట్రేగిపోతున్నారని హైకోర్టు మండిపడింది&period; &OpenCurlyQuote;2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం’ అని విజయవాడలో ఫ్లెక్సీ పెట్టారంటే వారికెంత ధైర్యం ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది&period; దీనికి కారణం పోలీసుల అసమర్థత కాదా అని నిలదీసింది&period; ఎవరిని విధ్వంసం చేస్తారు&quest; రాష్ట్రాన్నా&comma; రాష్ట్ర ప్రజలనా అంటూ ప్రశ్నించింది&period; ఉల్లంఘనలకు పాల్పడి ఇష్టమొచ్చినట్టు మాట్లాడాలన్నా&comma; సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలన్నా భయపడేలా పోలీసుల చర్యలు ఉండాలంది&period; సామాజిక మాధ్యమాల్లో అసహ్య&comma; అభ్యంతరకర పోస్టులను పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే 2024 తర్వాత కూడా పోస్టులు పెట్టే ధైర్యం వస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది&period; పోలీసుల తీరు ఇలా ఉంటే ఎవరు భయపడతారని పేర్కొంది&period; పోలీసులు నిద్రపోతున్నారు కాబట్టే&period;&period; పోస్టులు పెట్టేవాళ్లు రెచ్చిపోతున్నారని వ్యాఖ్యానించింది&period; ఇప్పటికే పోస్టులు పెట్టిన కేసుల్లో దర్యాప్తు సక్రమంగా పూర్తి చేసి&comma; నిందితులను కోర్టు ముందు నిలబెడితే ఇంత ధైర్యం చేసేవాళ్లా అంటూ పోలీసులు&comma; సీఐడీ తీరును ఎండగట్టింది&period;<&sol;p>&NewLine;<p>సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా ముఖ్యమంత్రిని అవమానించడం అంటే ఐదు కోట్ల మంది ఆంధ్రులను అవమానించడం కాదా అంటూ నిలదీసింది&period; 2020లో హైకోర్టు సిటింగ్‌ జడ్జిలపై తీవ్ర అభ్యంతరకర&comma; ప్రతిష్ఠను దిగజార్చే పోస్టులు పెట్టారని గుర్తుచేసింది&period; ఈ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన ఫిర్యాదుతో కేసులు నమోదు చేసినా&comma; దర్యాప్తును సీబీఐకి అప్పగించినా ఫలితమే లేదంది&period; పోలీసులు&comma; సీఐడీ&comma; సీబీఐ ఏమీ చేయలేరనే ధైర్యంతోనే మళ్లీ మళ్లీ పోస్టులు పెడుతున్నారని ఆగ్రహించింది&period; జడ్జిలపై పోస్టులు పెట్టినవారిపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి పరిస్థితి పునరావృతమయ్యేది కాదని వ్యాఖ్యానించింది&period; మొదట్లోనే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయకపోవడం పోలీసుల తప్పేనంది&period; సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టుల కేసులను డీల్‌ చేయడంలో పోలీసులు తీవ్రంగా విఫలమయ్యారని ఘాటుగా వ్యాఖ్యానించింది&period; ఇమిగ్రేషన్‌ అధికారులు తనపై జారీ చేసిన లుకౌట్‌ సర్క్యులర్‌ ని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ సోషల్‌ మీడియా పూర్వ ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఇలా తీవ్రస్థాయిలో స్పందించింది&period; ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఉత్తర్వులిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.