82
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో హీరో ప్రభాస్ సలార్ సినిమా టిక్కెట్లను అధిక ధరకు రూ 3000 వరకు అమ్ముకుంటూ ప్రజలకు, అభిమానులకు అందకుండా థియేటర్ యాజమాన్యం, దళారులు పక్క మార్గంలో అమ్ముకుంటున్నారని, సినిమా టిక్కెట్లు అందరికీ అందే విధంగా ధరలు నియంత్రణ చేసి ప్రభుత్వ ధరలకే థియేటర్ల వద్ద ఇచ్చే విధంగా చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్డీవో శ్రీనివాసులు రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భీమవరం ఎంపీపీ పేరుచర్ల నరసింహరాజు మాట్లాడుతూ అందరూ అభిమానించే హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమాకు టిక్కెట్లను థియేటర్ యాజమాన్యం, దళారులు 1000 నుండి 3000 వరకు అమ్ముకుంటూ, సామాన్యులకు టికెట్ అందకుండా చేస్తున్నారని, ఈ విషయమే ఆర్డిఓ ని కలిసి వినతి పత్రం ఇచ్చామని తెలియజేశారు.