సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధిలో డ్వాక్రా మహిళలను వినియోగించడం ద్వారా, సత్ఫలితాలను పొందగలిగామని ప్రముఖ సేంద్రీయ ఆహార ఎగుమతి చేసే లోలా కంపెనీ సీఈవో తలారి శిరీష అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 2000 ఎకరాల్లో మహిళలు, రైతుల సహకారంతో సేంద్రియ ఆహార ఉత్పత్తులను సాగు చేయగలిగామన్నారు. మంగళవారం గోకవరం మండలం, వీర్లంకపల్లిలో సేంద్రీయ మామిడి వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సేంద్రియ వ్యవసాయంలో నూతన విధానాలను, రైతులకు పరిచయం చేస్తూ వారి ఆర్దిక అభివృద్ధికి లోలా కంపెనీ కృషి చేస్తుందన్నారు. రంపచోడవరం ఐటీడీఏ సహకారంతో ఇప్పటివరకు సుమారు 2000 కేజీల పసుపు, అటవీ తేనెలను విదేశాలకు ఎగుమతి చేయగలిగామన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సేంద్రియ ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.
సేంద్రీయ ఆహార పదార్థాల విక్రయాలు..
73
previous post