న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పురపాలక సంఘాలలో కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ సిబ్బంది సమ్మె చేయటంతో దాన్ని నిర్వీర్యం చేసేందుకు కొన్ని మున్సిపాలిటీలలో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలోగ్గి ప్రైవేట్, సచివాలయ సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. దానికి నిదర్శనం ఈ సంఘటనే.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మున్సిపాలిటీలో మూడు రోజులుగా సిబ్బంది సమ్మె బాట పట్టారు. దీంతో రోడ్లపై ఎక్కడ చెత్త అక్కడ నిలిచిపోయింది. ప్రైవేట్ సిబ్బంది పనులు చేసేందుకు రాకపోవటం వల్ల మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బందిని రంగంలోకి దింపారు. వారితో ఇలా రోడ్లు శుభ్రం చేయించారు. దీన్ని చూసిన కార్మిక సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. సిబ్బంది సమ్మె చేస్తుంటే వారికి సంఘీభావం తెలపాల్సింది పోయి.. ఇలా సచివాలయ సిబ్బందితో పనులు చేయించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం స్వచ్ఛభారత్ చేస్తున్నాము అని అంటున్నారు.
కమిషనర్ వివరణ కోరగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని స్వచ్ఛ భారత్ చేపట్టామని అన్నారు.
సచివాలయ సిబ్బందితో పారిశుద్ధ్య పనులు..
66
previous post