న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పురపాలక సంఘాలలో కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ సిబ్బంది సమ్మె చేయటంతో దాన్ని నిర్వీర్యం చేసేందుకు కొన్ని మున్సిపాలిటీలలో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలోగ్గి ప్రైవేట్, సచివాలయ సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. దానికి నిదర్శనం ఈ సంఘటనే.. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మున్సిపాలిటీలో మూడు రోజులుగా సిబ్బంది సమ్మె బాట పట్టారు. దీంతో రోడ్లపై ఎక్కడ చెత్త అక్కడ నిలిచిపోయింది. ప్రైవేట్ సిబ్బంది పనులు చేసేందుకు రాకపోవటం వల్ల మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బందిని రంగంలోకి దింపారు. వారితో ఇలా రోడ్లు శుభ్రం చేయించారు. దీన్ని చూసిన కార్మిక సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. సిబ్బంది సమ్మె చేస్తుంటే వారికి సంఘీభావం తెలపాల్సింది పోయి.. ఇలా సచివాలయ సిబ్బందితో పనులు చేయించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం స్వచ్ఛభారత్ చేస్తున్నాము అని అంటున్నారు.
కమిషనర్ వివరణ కోరగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని స్వచ్ఛ భారత్ చేపట్టామని అన్నారు.
Secretariat staff
తమ పిల్లలను అంగన్వాడీ బడులకు ఎలా పంపాలని చిన్నారుల తల్లిదండ్రులు సచివాలయం సిబ్బంది ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని 45,46 అంగన్వాడి కేంద్రానికి చిన్నారులను పంపాలని ఇళ్ళ వద్దకు వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత పాఠశాలల వద్దకు వెళ్లిన తల్లిదండ్రులు మీ మొహాలు తమకు తెలియదని పిల్లలను మీ వద్దకు ఎలా పంపాలని ప్రశ్నించారు. తమ పిల్లల ఆలనా పాలనా మొత్తం అంగన్వాడీ టీచర్, ఆయాలకు తెలుసని మీకు ఎలా తెలుస్తుందని అన్నారు. దీంతో సచివాలయం సిబ్బంది వద్ద సమాధానాలు లేక మౌనంగా కూర్చుండిపోయారు.
Read Also..
గత మూడు రోజులుగా తమ డిమాండ్లు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు సుమారు లక్ష పదివేల మంది రోడ్డుమీద నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. తమ ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని తమ యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీలు, తప్పని పరిస్థితుల్లో అంగన్వాడీ సెంటర్లను మూసివేసి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఎలాగైనా అంగన్వాడీల సమ్మెను విఫలం చేయాలని ఆలోచనతో ఈరోజు బాపట్ల మండలం స్టువర్ట్ పురం గ్రామంలో ఎస్టి కాలనీలోని తాళాలు వేసి ఉన్న అంగన్వాడీ సెంటర్ ను బలవంతంగా సచివాలయం సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీ వీఆర్వో తదితర సిబ్బందితో తాళాలు పగలగొట్టి అంగన్వాడీ సెంటర్ ను తెరిచారు. ఈ విషయం తెలుసుకున్న అంగన్వాడీ సిబ్బంది అధికారులపై మండిపడ్డారు. తమ అనుమతి లేకుండా తమ సెంటర్ తాళాలు పగలగొట్టి తెరవడం అన్యాయమని ఆ సెంటర్లోని వస్తువులు మా వ్యక్తిగత ఫైళ్లు ఉంటాయని వాటికి ఏమైనా నష్టం వాటిల్తే ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు అన్నారు. బాపట్ల మండలం స్టువర్ట్ పురం గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లో కోడ్ నెంబర్ 20 ఎస్టి కాలనీ అంగన్వాడీ వర్కర్ ఆయా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. ఆ క్రమంలో సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీ, వీఆర్వో దగ్గరుండి తాళాలు పగలగొట్టి సెంటర్ ను తెరిపించారు.





Total views : 78263